Telugu Lyrics

Karige Loga Ee Kshanam Song Lyrics

కరిగేలోగా ఈ క్షణం పాట సాహిత్యం - ఆర్య 2

ShareWhatsAppXFacebook

Karige Loga Ee Kshanam Song Lyrics

కరిగే లోగా ఈ క్షణం

గడిపేయాలీ జీవితం

శిలగా మిగిలే నా హ్రుదయం సాక్షిగా

కనులైపోయే సాగరం

అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారె కన్నీరే చేరగా

గడిచే.. నిమిషం గాయమై

ప్రతి గాయం ఓ గమ్యమై

ఆ గమ్యం నీ గుర్తుగా.. నిలిచే.. నా ప్రేమా

కరిగే లోగా ఈ క్షణం

గడిపేయాలీ జీవితం

శిలగా మిగిలే నా హ్రుదయం సాక్షిగా

కనులైపోయే సాగరం

అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారె కన్నీరే చేరగా

పరుగులు తీస్తూ.. అలసిన ఓ నది నేనూ

ఇరు తీరాల్లో.. దేనికి చేరువ కానూ?

నిదురను దాటీ.. నడిచిన ఓ కల నేను

ఇరుకన్నుళ్ళో దేనికి సొంతం కానూ?

నా ప్రేమే నేస్తం అయ్యిందా..ఓ..ఓ

నా సగమేదో.. ప్రశ్నగ మారిందా..

నేడీ.. పంతానికి పేరుందా

ఉంటే.. విడదీసే వీలుందా

కరిగే లోగా ఈ క్షణం

గడిపేయాలీ జీవితం

శిలగా మిగిలే నా హ్రుదయం సాక్షిగా

కనులైపోయే సాగరం

అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారె కన్నీరే చేరగా

అడిగినవన్నీ.. కాదని పంచిస్తూనే

మరు నిముషంలో.. అలిగే పసివాడివిలే

నీ పెదవులపై.. వాడని నవ్వుల పువ్వే

నువు పెంచావా.. నీ కన్నిటిని చల్లీ

సాగే మీ జంటని చూస్తుంటే.. ఓ.. ఓ..

నా బాధంతటి అందంగా వుందే.. ఓ.. ఓ..

ఈ క్షణమే నూరెళ్లౌతానంటే.. ఓ..ఓ..

మరు జన్మే.. క్షణమైన.. చాలంతే

కరిగే లోగా ఈ క్షణం

గడిపేయాలీ జీవితం

శిలగా మిగిలే నా హ్రుదయం సాక్షిగా

కనులైపోయే సాగరం

అలలై పొంగే జ్ఞాపకం

కలలే జారె కన్నీరే చేరగా

గడిచే.. నిమిషం గాయమై

ప్రతి గాయం ఓ గమ్యమై

ఆ గమ్యం నీ గుర్తుగా.. నిలిచే.. నా ప్రేమా

ShareWhatsAppXFacebook

More from Arya 2

All songs from Arya 2