Telugu Lyrics

Andharilaa Nenunnana Song Lyrics

అందరిలా నేనున్నానా పాట సాహిత్యం - ముఖ చిత్రం

ShareWhatsAppXFacebook

Andharilaa Nenunnana Song Lyrics

అందరిలా నేనున్నానా.. అందిన నిన్నే చూస్తున్నా!

అందరికన్నా ముందున్నా.. ఆరాటాలే ఆగేనా?

నీటిని దాచే.. మేఘంలా

మబ్బుని దాచే.. గగనంలా

ఇద్దరమొకటై పోయేలా.. గుండెలలో నిను దాచేయ్‌నా

అల్లుకుని.. చిరు చెంపలపై.. తొలి సంతకమే కానా

అందరిలా నేనున్నానా.. అందిన నిన్నే చూస్తున్నా!

అందరికన్నా ముందున్నా.. ఆరాటాలే ఆగేనా?

నీ వెనకే నేనున్నాగా.. నీ సగమే నేనయ్యాగా

గాలికి చోటే లేకుండా.. నాలోనే.. దాచేయ్‌నా

రాతిరి రాని లోకానా.. నిద్దుర లేని మైకానా

ఊపిరితో నీ ఎద పైనా.. నీ బొమ్మే గీస్తున్నా

ఓ.. ఎంతసేపైనా.. చాలదంటున్నా

నీది జన్మంటూ.. మాట ఇస్తున్నా

నీటిని దాచే.. మేఘంలా

మబ్బుని దాచే.. గగనంలా

ఇద్దరమొకటై పోయేలా.. గుండెలలో నిను దాచేయ్‌నా

నిన్నటిలో.. నా రేపటిని.. నీ పేరున రాస్తున్నా

అందరిలా నేనున్నానా.. అందిన నిన్నే చూస్తున్నా!

అందరికన్నా ముందున్నా.. ఆరాటాలే ఆగేనా?

ShareWhatsAppXFacebook

More by Kaala Bhairava

All songs by Kaala Bhairava