Telugu Lyrics

Aparanji Madanude Song Lyrics

అపరంజి మదనుడే పాట సాహిత్యం - మెరుపు కలలు

ShareWhatsAppXFacebook

Aparanji Madanude Song Lyrics

అపరంజి మదనుడే.. అనువైన సఖుడులె.. అతడేమి అందగాడే

వరిచేల మెరుపులా.. వజ్రమై రత్నమై.. వచ్చె వలపంటి వాడే

విను వీధిలో ఉంటె.. సూర్యుడే వొడునే.. ఇల మీద వొరిగినాడే

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు.. శిశుబాలుడొచ్చినాడే

అపరంజి మదనుడే.. అనువైన సఖుడులె..

అతడేమి అందగాడే(అతడేమి అందగడే)

పోరాట భూమినే.. పూదోట కోనగా..

పులకింప చేసినాడే(పులకింప చేసినాడే)

కల్వారి మలనేలు కలికి ముత్యపు రాయి.. కన్నబిడ్డతడు లేవే

నూరేళ్ళ చీకటి.. ఒకనాడే పోగొట్టి.. వొడిలోన చేరినాడే

ఇరుకైన గుండెల్లొ.. అనురాగ మొలకగా.. ఇల బాలుడొచ్చినాడే

ముక్కారు కాలంలో.. పుట్టాడ్దు పూజకై.. పుష్పమై తోడు నాకై

అపరంజి మదనుడే.. అనువైన సఖుడులె.. అతడేమి అందగాడే(అతడేమి అందగడే)

వరిచేల మెరుపులా.. వజ్రమై రత్నమై..

వచ్చె వలపంటి వాడే(వచ్చె వలపంటి వాడే)

అపరంజి మదనుడే.. అనువైన సఖుడులె..

అతడేమి అందగడే(అతడేమి అందగడే)

వచ్చె వలపంటి వాడే(వచ్చె వలపంటి వాడే)

ShareWhatsAppXFacebook

More from Merupu Kalalu

All songs from Merupu Kalalu

More by Anuradha Sriram

All songs by Anuradha Sriram