Telugu Lyrics

Brindavanamadi Andaridi Song Lyrics

బృందావనమది అందరిది పాట సాహిత్యం - మిస్సమ్మ

ShareWhatsAppXFacebook

Brindavanamadi Andaridi Song Lyrics

బృందావనమది అందరిది.. గోవిందుడు అందరి వాడేలే

ఎందుకె రాధ ఈసునసూయలు.. అందములందరి ఆనందములే

పిల్లన గ్రోవిని పిలుపును వింటే.. ఉల్లము ఝల్లున పొంగదటే

రాగములో.. అనురాగము చిందిన.. జగమే ఊయలలూగదటే

రాగములో.. అనురాగము చిందిన.. జగమే ఊయలలూగదటే

బృందావనమది అందరిది.. గోవిందుడు అందరి వాడేలే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే

ఎందుకె రాధ ఈసునసూయలు.. అందములందరి ఆనందములే

బృందావనమది అందరిది.. గోవిందుడు అందరి వాడేలే

గోవిందుడు అందరి వాడేలే

Lyrics : Pingali Nagendrarao

ShareWhatsAppXFacebook

More from Missamma

All songs from Missamma

More by A.M.Rajah

All songs by A.M.Rajah