Telugu Lyrics

Aaraneekuma Ee Deepam Kartika Deepam Song Lyrics

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం పాట సాహిత్యం - కార్తీక దీపం

ShareWhatsAppXFacebook

Aaraneekuma Ee Deepam Kartika Deepam Song Lyrics

Karthika Deepam Lyrics

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం

చేరని నీ పాదపీఠం కర్పూర దీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం

చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం

ఇదే సుమా నా కుంకుమ తిలకం

ఇదే సుమా నా మంగళ సూత్రం

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం

చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం

ఇంటిలోన నా పాప రూపున.. గోరంత దీపం

కంటికెదురుగ కనబడువేళల.. కొండంత దీపం

నా మనస్సులో వెలిగే దీపం

నా మనుగడా నడిపే దీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం

చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం

చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం

ఆకాశాన.. ఆ మణి దీపాలేముత్తైదువులుంచారో

ఈ కోనేటా.. ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారో

ఏమైనా ఏదైనా.. కోవెలలో కొలువై వుండే

దేవికి పట్టిన హారతులే

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం

చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం

చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం

నోచిన నోములు పండెనని.. ఈ అనంద దీపం

నా దాచిన కోర్కెలు నిండునని.. ఈ ఆశా దీపం

నా నోచిన నోములు పండెనని.. ఈ అనంద దీపం

నా దాచిన కోర్కెలు నిండునని.. ఈ ఆశా దీపం

ఎటనైనా ఎప్పుడైనా.. నే కొలిచే కళ్యాణ దీపం

నీ వలచే నా ప్రాణ దీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం

చేరని.. నీ పాదపీఠం కర్పూర దీపం

చేరని.. నీ పాదపీఠం నా ప్రాణ దీపం

ShareWhatsAppXFacebook

More from Karthika Deepam

All songs from Karthika Deepam

More by S. Janaki

All songs by S. Janaki