Telugu Lyrics

Laahe Laahe Song Lyrics

ఆచార్య - లాహే లాహే పాట - సాహిత్యం

ShareWhatsAppXFacebook

Laahe Laahe Song Lyrics

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే లాహే.. లాహే లాహే.. లాహేలా హేలాహే

కొండలరాజు బంగరుకొండా.. కొండాజాతికి అండాదండా

మద్దేరాతిరి లేచి.. మంగళ గౌరి మల్లెలు కోసిందే

వాటిని మాలలు కడతా.. మంచు కొండల సామిని తలసిందే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే లాహే.. లాహే లాహే.. లాహేలా హేలాహే

మెల్లో మెలికల నాగులదండా.. వలపుల వేడికి ఎగిరిపడంగా

ఒంటి ఇబూది జల జల రాలిపడంగా.. సాంబడు కదిలిండే

అమ్మా పిలుపుకు సామి.. అత్తరు సెగలై విలవిల నలిగిండే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే లాహే.. లాహే లాహే.. లాహేలా హేలాహే

కొరకొర కొరువులు మండే కళ్ళు..

జడలిరబూసిన సింపిరికురులు..

ఎర్రటి కోపాలెగసిన కుంకంబొట్టు.. వెన్నెల కాసిందే

పెనివిటి రాకను తెలిసి.. సీమాతంగి సిగ్గులు పూసిందే

ఉబలాటంగా ముందటికురికి.. అయ్యవతారం చూసిన కలికి

ఏందా శంఖం శూలం భైరాగేశం.. ఏందని సనిగిందే

ఇంపుగ ఈపూటైనా.. రాలేవా అని సనువుగ కసిరిందే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే లాహే.. లాహే లాహే.. లాహేలా హేలాహే

లోకాలేలే ఎంతోడైనా.. లోకువమడిసే సొంతింట్లోనా

అమ్మోరి గడ్డంపట్టి బతిమాలినవి.. అడ్డాల నామాలు

ఆలుమగల నడుమన అడ్డంరావులె.. ఇట్టాటి నీమాలూ

ఒకటో జామున కలిగిన విరహం..

రెండో జాముకి ముదిరిన విరసం..

సర్దుకుపోయే సరసం కుదిరేఏళకి.. మూడో జామాయే

ఒద్దిక పెరిగే నాలుగో జాముకి.. గుళ్ళో గంటలు మొదలాయే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే లాహే.. లాహే లాహే.. లాహేలా హేలాహే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే.. లాహే లాహేలా హేలాహే

లాహే లాహే.. లాహే లాహే.. లాహేలా హేలాహే

ప్రతి ఒక రోజిది జరిగే గట్టం..

యెడమొకమయ్యి.. ఏకం అవటం

అనాది అలవాటీళ్ళకి..  అలకలలోనే కిలకిలమనుకోటం

స్వయాన చెబుతున్నారు.. అనుబంధాలు కడతేరే పాఠం

ShareWhatsAppXFacebook

More from Acharya

All songs from Acharya