Telugu Lyrics

Manasulone Nilichipoke Song Lyrics

మనసులోనె నిలిచిపోకె పాట సాహిత్యం - వరుడు కావలెను

ShareWhatsAppXFacebook

Manasulone Nilichipoke Song Lyrics

మనసులోనె నిలిచిపోకె.. మైమరపుల మధురిమా

పెదవి దాటి వెలికిరాక.. బెదురెందుకె హ్రుదయమా

మనసులోనె నిలిచిపోకె.. మైమరపుల మధురిమా

పెదవి దాటి వెలికిరాక.. బెదురెందుకె హ్రుదయమా

ఎన్నినాళ్లిలా.. ఈ దోబూచుల సంశయం

అన్ని వైపులా.. వెనుతరిమే ఈ సంబరం

అదును చూసి అడగదేమి.. లేనిపోని బిడియమా

ఊహలోనె ఊయలూపి.. జారిపోకె సమయమా

తడబడే తలపుల తపనా.. ఇదని.. తెలపకా

మనసులోనె నిలిచిపోకె.. మైమరపుల మధురిమా

పెదవి దాటి వెలికిరాక.. బెదురెందుకె హ్రుదయమా

మనసులోనె నిలిచిపోకె.. మైమరపుల మధురిమా

పెదవి దాటి వెలికిరాక.. బెదురెందుకె హ్రుదయమా

రా ప్రియా శశివదనా.. అని యే పిలుపూ వినబడెనా

తనపై ఇది వలనా.. ఏదో భ్రమలో ఉన్నానా

చిటికె చెవిబడి.. త్రుటిలో మతి చెడి

నానా యాతనా.. మెలిపెడుతుండగా

నా ప్రతి అణువణువూ.. సుమమై విరిసే తొలి ఋతువూ

ఇకపై నా ప్రతి చూపూ.. తనకై వేచే నవవధువూ

చెలిమే బలపడి.. ఋణమై ముడిపడే

రాధాలాపనా.. మొదలవుతుండగా

మనసులోనె నిలిచిపోకె.. మైమరపుల మధురిమా

పెదవి దాటి వెలికిరాక.. బెదురెందుకె హ్రుదయమా

మనసులోనె నిలిచిపోకె.. మైమరపుల మధురిమా

పెదవి దాటి వెలికిరాక.. బెదురెందుకె హ్రుదయమా

ShareWhatsAppXFacebook

More from Varudu Kaavalenu

All songs from Varudu Kaavalenu

More by Chinmayi

All songs by Chinmayi