Telugu Lyrics

Neeli Ningi Thaakalani Song Lyrics

నీలి నింగి తాకాలనీ పాట సాహిత్యం - గూడుపుఠాణి

ShareWhatsAppXFacebook

Neeli Ningi Thaakalani Song Lyrics

నీలి నింగి తాకాలనీ

వాన విల్లై మెరవాలనీ

ఆడుతూ పాడుతూ సాగింది.. ఓ జంటా

పాప లాంటి పసివాళ్ళనీ

ప్రేమలోకం దరిచేరనీ

చల్లనీ వెన్నెలై.. నవ్వుల్ని నింపాలనీ

సెలయేరు నడకల్లే.. సాగేనా పరుగూ

తడబాటూ లేకుండా.. ఆగేనా అడుగూ

వెలుగు పూలను పూచే ఉదయం

రేయి ఆశల తారల తీరం

అడుగు వేయక అందదు గమ్యం

రేపు యేముందొ దాచేటి పేజీనె.. కాలం

నీలి నింగి తాకాలనీ

వాన విల్లై మెరవాలనీ

ఆడుతూ పాడుతూ సాగింది.. ఓ జంటా

చందమామ చల్ల గాలి.. వెన్నెలల్లె చల్లినా

చీకటి చాటున.. యేమి దాచెనో

రంగు రంగు రెక్కలున్న.. సీతాకోకై వాలిన

కొమ్మల్లొ దాగిన.. గుట్టు యేమిటో

ఆ చినుకులిలా.. ఓ తొలకరి కలగా

పుడమి తడిపిన.. జల్లుగా

ఈ పయనమిలా.. ఆ గగనము చూసినా

తిరిగి ఎగురుట.. సాధ్యమా

ఈ పదములకే.. ఓ బదులవుతూ

యే వెలుగును చూపి.. దారి అవ్వదే!!

నీలి నింగి తాకాలనీ

వాన విల్లై మెరవాలనీ

ఆడుతూ పాడుతూ సాగింది.. ఓ జంటా

ShareWhatsAppXFacebook

More by Sunitha Upadrashta

All songs by Sunitha Upadrashta