O Sandamama Song Lyrics
ఓ సందమామా పాట సాహిత్యం - భీమ్లా నాయక్
O Sandamama Song Lyrics
నువు జల్లే ఎన్నెలంతా..
చల్లగుందని మిడిసిపోకే.. ఓ సందమామా
తన ఒళ్ళు కాల్చి..
ఎండ నీకు వెలిగిపోయే గుణమిచ్చిందే.. నా సందమామా
సందె ఏళా.. కుంగుతుంటే..
గెలిసినావని సంబరపడకే.. ఓ సందమామా
కణకణా నిప్పుల.. కణికవొలే..
పొద్దుపొడిసే.. తెల్లవారీ.. నా సందమామా
కీచురాళ్ళ సప్పుడు సేసి..
ఘోసపెట్టినాననుకోకే.. ఓ సందమామా
మబ్బు చేసే.. గర్జనలింటే..
దద్దరిల్లి.. ముక్కలైతావ్.. నా సందమామా
ఆకుపచ్చని అమ్మతోటి..
ఆకతాయి ఆటలొద్దే.. ఓ సందమామా
నిన్ను కూల్చగ..
జమ్మిచెట్టునా ఆయుధాలను దాచుకుందే.. నా సందమామా
సుట్టు సుక్కలు ఉన్నయంటూ..
సూసి నువ్వు మురిసిపోకే.. ఓ సందమామా
నీ సిట్టసివరి దారిలోనా..
నీడ కూడ తోడురాదే.. నా సందమామా
సీకటంతా తాగి నీవు..
సిత్తరంగా సిందేయకే.. ఓ సందమామా
అమావాస్య ఘడియ నీకు..
ముందరున్నదని మరిసిపోకే.. నా సందమామా
నేను నేననే పట్టుతోటి..
నీకు నువ్వే దూరం గాకే.. ఓ సందమామా
నువ్వు పుట్టక.. ముందే పుట్టే..
నువ్వు పోయినా.. ఉంటదే లోకం.. నా సందమామా
More from Bheemla Nayak
All songs from Bheemla Nayak →More by Mohana Bhogaraju
Neetho Unte Chalu Lyrics - Bimbisara Movie Song
నీతో ఉంటే చాలు పాట సాహిత్యం - బింబిసార
Bimbisara · 2022
Vakeel Saab - Maguva Maguva Sad Version Song - Lyrics
వకీల్ సాబ్ - మగువా మగువా పాట - సాహిత్యం
Vakeel Saab · 2021
Sreekaram - Sandalle Sandalle Song - Lyircs
Sreekaram · 2021
Prati Roju Pandage - Oo Baava Song - Lyrics
Prati Roju Pandage - Oo Baava Song - Lyrics
Prati Roju Pandage · 2019
Venky Mama - Venky Mama Title Song - Lyrics
Venky Mama - Venky Mama Title Song - Lyrics
Venky Mama · 2019