Telugu Lyrics

Obulamma Song Lyrics

ఓబులమ్మా పాట సాహిత్యం - కొండపొలం

ShareWhatsAppXFacebook

Obulamma Song Lyrics

గింజ గింజ గింజ మీద..

బుసుక బుసుక బుసుక తీసి..

తియ్యంగ బత్తెమై పోయే

బొట్టే కట్టి.. చేతబట్టిన..

చేతిలోకి.. చేరాలని.. గుండుజల్లారాట పడిపోయే

ఓ ఓ ఓబులమ్మా!

బొమ్మకర్ర మేణి ఛాయ ముద్దుగుమ్మా

కపర కపర రేతిరిలోన.. కాలమంత లెక్కలుగట్టి..

గుండెలోనె నీ పేరు జపమాయే

ఇదివరకెపుడు తెలియని ఎరగని..

తురుపే మైమరపిస్తు ఉంటే

కంటికేమొ కునుకే దూరపు చుట్టమాయే

కన్నులు కన్నులు వింటున్న..

చూపులు చూపులు చెబుతున్నా..

మాటల మాటలు చూస్తున్న మగతలలో..

ఎవ్వరికెవ్వరు సావాసం.. ఎక్కడికక్కడ ప్రయాణం

ఎప్పటికప్పుడు ఎదురయ్యే.. మలుపులలో

చదివేసాడేమో నా కలలూ.. ఉంటాడే నీడై రేపవలూ

తిష్టేసినాడే గోతరాలు.. పొమ్మంటె పోడే ఈడిగలూ

ఓ ఓ ఓబులమ్మా!

పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మా

కపర కపర రేతిరిలోన.. కాలమంత లెక్కలుగట్టి..

గుండెలోనె నీ పేరు జపమాయే

ఇదివరకెపుడు తెలియని ఎరగని..

తలపే మైమరపిస్తు ఉంటే

కంటికేమొ కునుకే దూరపు చుట్టమాయే

ఓ ఓ ఓబులమ్మా!

బొమ్మకర్ర మేణి ఛాయ ముద్దుగుమ్మా

ఓ ఓ ఓబులమ్మా!

పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మా

ShareWhatsAppXFacebook

More from Kondapolam

All songs from Kondapolam

More by P V N S Rohit

All songs by P V N S Rohit