Prema Swaramulalo Song Lyrics
ప్రేమ స్వరములలో పాట సాహిత్యం - 24
Prema Swaramulalo Song Lyrics
ప్రేమ పరిచయమే.. దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో.. దైవ స్మరణములే
అని తెలిసింది.. తొలిసారి.. నీ ప్రేమతో
మది మునిగింది.. నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే.. దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో.. దేవతార్చనలే
కోకిలసలు కోరుకొనని.. ప్రేమ తపస్సు మనదిలే
అథిదులెవరు ఎదురుపడని.. ప్రేమ తిథులు మనవే
అమృతములు ఎగసిపడిన.. ప్రేమ నదులు మనవే
చరితల కాగితాలలోన.. చదవలేని ప్రేమనే
నీలో చదివా.. ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే.. దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో.. దేవతార్చనలే
హృదయగళము పాడుతున్న.. ప్రేమ గీతి మనదిలే
కనుల కలము రాసుకున్న.. ప్రేమలేఖ మనదే
పెదవి ప్రమిద పంచుతున్న.. ప్రేమ జ్యోతి మనదే
మనషుల ఊహలోన సైతం.. ఉండలేని ప్రేమతో
ఎదుటే ఉన్నా.. ఈ క్షణాలలో
ప్రేమ పరిచయమే.. దైవ దర్శనమే
ప్రేమ అడుగులలో.. దేవతార్చనలే
అని తెలిసింది.. తొలిసారి.. నీ ప్రేమతో
మది మునిగింది.. నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే.. దైవ దర్శనమే
ప్రేమ స్వరములలో.. దైవ స్మరణములే
అని తెలిసింది.. తొలిసారి.. నీ ప్రేమతో
మది మునిగింది.. నీ ప్రేమలో
ప్రేమ పరిచయమే.. దైవ దర్శనమే