Telugu Lyrics

Kopama Napaina Song Lyrics

ShareWhatsAppXFacebook

Kopama Napaina Song Lyrics

హోయ్.. కోపమా.. నా పైనా

ఆపవా.. ఇకనైనా

అంతగా.. బుస కొడుతుంటే.. నేను తాళగలనా.. హో

చాలులే.. నీ నటనా

సాగవే.. ఎటు పైనా

ఎంతగ.. నస పెడుతున్నా.. లొంగిపోనె లలనా

దరి చేరిన నెచ్చెలిపైనా.. దయ చూపవ కాస్తైనా

మన దారులు.. ఎప్పటికైనా.. కలిసేనా.. హో

హో.. కస్సుమని కారంగా.. కసిరినది చాలింకా

ఉరుము వెనుకా.. చినుకు తడిగా.. కరగవా కనికారంగా

కుదురుగా.. కడదాకా.. కలిసి అడుగేయవుగా

కన్నుల వెనుకే.. కరిగిపోయే.. కలవి గనుకా

నను గొడుగై కాసే నువ్వు.. పిడుగులు కురిపిస్తావా

నువు గొడుగును ఎగరేస్తావే.. జడివానా.. హో

హోయ్.. కోపమా.. నా పైనా

ఆపవా.. ఇకనైనా

అంతగా.. బుస కొడుతుంటే.. నేను తాళగలనా.. హో

హో.. తిరిగి నిను నా దాకా.. చేర్చినది చెలిమేగా

మనసులోని.. చెలియవమ్మా.. చెరిపినా చేరగదు గనుకా

సులువుగా నీలాగా.. మరిచిపోలేదింకా..

మనసు విలువ.. నాకు బాగా.. తెలుసు గనకా

యెగసే.. అల యేనాడైనా.. తన కడలిని విడిచేనా

వొదిలేస్తే.. తిరిగొచ్చేనా.. క్షణమైనా.. హో

హోయ్.. కోపమా.. నా పైనా

ఆపవా.. ఇకనైనా

అంతగా.. బుస కొడుతుంటే.. నేను తాళగలనా.. హో

ShareWhatsAppXFacebook

More from Varsham

All songs from Varsham →

More by Karthik

All songs by Karthik →