Kannulu Chedire Song Lyrics
కన్నులు చెదిరే పాట సాహిత్యం - డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు
Kannulu Chedire Song Lyrics
కన్నులు చెదిరే అందాన్నీ.. వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే.. నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే.. నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే.. ఇంకోలా.. నే మళ్ళీ పుట్టానే
నీ కురులా.. కెరటములోనా
చూపులిలా.. మునిగినవేమో
చిక్కానే చేపై నే తీగలు లేని ఈ వల్లో
నెమ్మదిగా.. నువ్వొదిలే.. నవ్వుల గాలాల్లో
కన్నులు చెదిరే అందాన్నీ.. వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే.. నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే.. నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే.. ఇంకోలా.. నే మళ్ళీ పుట్టానే
ఓ హో.. నువ్వొచ్చి నా ప్రపంచమౌతుంటే..
ప్రపంచమే.. వెనక్కి పొతుందే
నువిచ్చిన కలల్లొ నేనుంటె.. వసంతమే తలొంచుకుంటుందే
అడగాలే గానీ.. జీవితమైనా..
ఆ క్షణమే.. నీకై రాసిచ్చేయనా
చిక్కానే చేపై నే తీగలు లేని ఈ వల్లో
నెమ్మదిగా.. నువ్వొదిలే.. నవ్వుల గాలాల్లో
కన్నులు చెదిరే అందాన్నీ.. వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే.. నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే.. నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే.. ఇంకోలా.. నే మళ్ళీ పుట్టానే
ఓ హో.. వయస్సులో.. ఎరక్క నేనున్నా
సొగస్సులో.. ఇరుక్కుపోతున్నా
మనస్సులో.. నిజంగా నీ పేరే
తపస్సులా.. స్మరించుకుంటున్నా
ఎదురై నీ రూపం నించొని ఉంటే
ఎగిరెల్లీ నింగి అంచున ఉంటా
తాకే వీల్లేకున్నా.. నిన్నందుకుంటున్నా.. తలుకా.. తలుకా
కన్నులు చెదిరే అందాన్నీ.. వెన్నెల తెరపై చూసానే
కదిలే కాలాన్నే.. నిమిషం నిలిపేసానే
నన్నిక నీలో విడిచానే.. నిన్నలు గాల్లో కలిపానే
ఇపుడే.. ఇంకోలా.. నే మళ్ళీ పుట్టానే
More from WWW
All songs from WWW →More by Yazin Nizar
Prapanchamanta Kore Ramude Nuvvaa Lyrics - Sita Ramam Movie Song
ప్రపంచమంత కోరె రాముడే నువ్వా పాట సాహిత్యం - సీతారామం
Sita Ramam · 2022
Dosti Lyrics - RRR Movie Song
దోస్తీ పాట సాహిత్యం - ఆర్ఆర్ఆర్ చిత్రం
RRR · 2021
Kousalya Krishnamurthy - Muddabanthi Song - Lyrics
Kousalya Krishnamurthy · 2019
Ekkadiki Pothavu Chinnavada - Chirunama Thana Chirunama Song - Lyrics
Ekkadiki Pothavu Chinnavada · 2016
Uppena - Ranguladdhukunna Song - Lyrics
Uppena · 2020