Telugu Lyrics

Komuram Bheemudo Song Lyrics

కొమురం భీముడో పాట సాహిత్యం - ఆర్ఆర్ఆర్

ShareWhatsAppXFacebook

Komuram Bheemudo Song Lyrics

భీమా.. నినుగన్న నేల తల్లి.. ఊపిరి పోసిన సెట్టుసేమ..

పేరు పెట్టిన గోండు జాతి.. నీతో మాట్లాడుతోంద్ర.. వినబడుతుందా?

కొమురం భీముడో.. కొమురం భీముడో

కొర్రాసునెగడొలే..

మండాలి కొడుకో.. మండాలి కొడుకో

కొమురం భీముడో.. కొమురం భీముడో

రగరాగ సూరీడై..

రగలాలి కొడుకో.. రగలాలి కొడుకో

కాల్మొక్తా బాంచేన్ అని.. వొంగి తోగాలా

కారడివి తల్లీకి.. పుట్టానట్టేరో పుట్టానట్టేరో

జులుము గద్దెకు.. తలను వొంచి తోగాలా

దుడుము తల్లి పేగుల.. పెరగానట్టేరో పెరగానట్టేరో

కొమురం భీముడో.. కొమురం భీముడో

కొర్రాసునెగడొలే..

మండాలి కొడుకో.. మండాలి కొడుకో

షర్మామొలిసే దెబ్బకు.. అప్పంతోగాలా

సినికే రక్తము సూసి.. సెదిరి తోగాలా

గుబులేసి కన్నీరు వొణికి తోగాలా

భూతల్లి సనుబాలు తాగానట్టేరో తాగానట్టేరో

కొమురం భీముడో.. కొమురం భీముడో

కొర్రాసునెగడొలే..

మండాలి కొడుకో.. మండాలి కొడుకో

కాలువై పారే.. నీ గుండె నెత్తూరూ

కాలువై పారే.. నీ గుండె నెత్తూరూ

నేలమ్మ నుదిటి బొట్టై తుంది సూడు

అమ్మ కాళ్ల పారాణై తుంది సూడు

తల్లి పెదవుల నవ్వై మెరిసింది సూడు

కొమురం భీముడో.. కొమురం భీముడో

పుడమి తల్లికి జనమా..

అరణమిస్తివిరో.. కొమురం భీముడో

ShareWhatsAppXFacebook

More from RRR

All songs from RRR

More by Kaala Bhairava

All songs by Kaala Bhairava