Telugu Lyrics

Sannaga Veeche Song Lyrics

సన్నగ వీచే పాట సాహిత్యం - గుండమ్మ కథ

ShareWhatsAppXFacebook

Sannaga Veeche Song Lyrics

సన్నగ వీచే చల్ల గాలికి.. కనులు మూసినా.. కలలాయె

తెల్లని వెన్నెల పానుపుపై.. ఆ.. కలలో.. వింతలు కననాయే

సన్నగ వీచే చల్ల గాలికి.. కనులు మూసినా.. కలలాయె

తెల్లని వెన్నెల పానుపుపై.. ఆ.. కలలో.. వింతలు కననాయే

అవి తలచిన ఏమో సిగ్గాయే

కనులు తెరచిన నీవాయే.. నే కనులు మూసినా నీవాయే

కనులు తెరచిన నీవాయే..

నిదురించిన నా హ్రుదయమునెవరో.. కదిలించిన సడి విననాయే

నిదురించిన నా హ్రుదయమునెవరో.. కదిలించిన సడి విననాయే

కలవరపడి నే కనులు తెరువగా.. కంటి పాపలో నీవాయే

ఎచట చూచినా.. నీవాయే

కనులు తెరచిన నీవాయే.. నే కనులు మూసినా నీవాయే

కనులు తెరచిన నీవాయే..

మేలుకొనిన నా మదిలో యేవో.. మెల్లని పిలుపులు విననాయే

మేలుకొనిన నా మదిలో యేవో.. మెల్లని పిలుపులు విననాయే

ఉలికిపాటుతో కలయ వెతక.. నా హ్రుదయ ఫలకమున నీవాయే

కనులు తెరచినా నీవాయే..

కనులు మూసినా నీవేనాయే..

ShareWhatsAppXFacebook

More from Gundamma Katha

All songs from Gundamma Katha

More by P. Susheela

All songs by P. Susheela