Telugu Lyrics

Sirivennela Song Lyrics

సిరివెన్నెల పాట సాహిత్యం - శ్యాం సింగ రాయ్

ShareWhatsAppXFacebook

Sirivennela Song Lyrics

నెల రాజునీ.. ఇల రాణినీ

కలిపిందికదా.. సిరివెన్నెలా

దూరమా.. దూరమా.. తీరమై.. చేరుమా

నడి రాతిరిలో.. తెరలు తెరచి

నది నిద్దురలో.. మగత మరచి

ఉదయించినదా.. కులుకు లొలుకు.. చెలి మొదటి కలా

తన నవ్వులలో.. తలుకు తలుకు

తన చంపలలో.. చమకు చమకు

తన మువ్వలలో.. ఝనకు ఝనకు

సరి కొత్త కలా

చాంగురే.. ఇంతటిదా నా సిరి

అన్నది.. ఈ శారదా రాతిరి

మిలమిలా చెలి కన్నుల..

తన కలలను కనుగొని.. అచ్చెరువున మురిసి

అయ్యహో.. ఎంతటిదీ సుందరి

ఎవ్వరూ.. రారు కదా తన సరి

సృష్టికే అద్దము చూపగ.. పుట్టినదేమో నారి సుకుమారీ

ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే

తెరదాటి చెరదాటి.. వెలుగు చూస్తున్న భామనీ

సరిసాటి ఎదమీటి.. పలకరిస్తున్న శ్యామునీ

ప్రియమార గమనిస్తూ.. పులకరిస్తోంది యామినీ

కలబోసే ఊసులే.. విరబూసే ఆశలై

నవరాతిరి పూసిన.. వేకువ రేఖలు రాసినదీ నవల

మౌనాలే మమతలై.. మధురాలా కవితలై

తుదిచేరని కబురుల.. కథకలి కదిలెను

రేపటి కథలకు మున్నుడిలా

తన నవ్వులలో.. తలుకు తలుకు

తన చంపలలో.. చమకు చమకు

తన మువ్వలలో.. ఝనకు ఝనకు

సరి కొత్త కలా

ఇదిలానీ.. ఎవరైనా.. చూపనే లేదు కంటికి

అదెలాగో.. తనకైనా.. తోచనే లేదు మాటకీ

ఇపుడిపుడే.. మనసైనా.. రేపు దొరికింది చూపుకీ

సంతోషం సరసనా.. సంకోచం మెరిసినా

ఆ రెంటికి మించిన.. పరవశ లీలను.. కాదని అనగలమా

కథ కదిలే వరసనా.. తమ ఎదలేం తడిసినా

గతజన్మల పొడవున.. దాచిన దాహము..

ఇపుడే వీరికి పరిచయమా

తన నవ్వులలో.. తలుకు తలుకు

తన చంపలలో.. చమకు చమకు

తన మువ్వలలో.. ఝనకు ఝనకు

సరి కొత్త కలా

తన నవ్వులలో.. తలుకు తలుకు

తన చంపలలో.. చమకు చమకు

తన మువ్వలలో.. ఝనకు ఝనకు

సరి కొత్త కలా

ShareWhatsAppXFacebook

More from Shyam Singha Roy

All songs from Shyam Singha Roy

More by Anurag Kulkarni

All songs by Anurag Kulkarni