Telugu Lyrics

Sooreede Song Lyrics

సూరీడే పాట సాహిత్యం - సలార్

ShareWhatsAppXFacebook

Sooreede Song Lyrics

సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి

చిమ్మ చీకటిలోను.. నీడలా ఉండెటోడూ

రెప్పనొదలక.. కాపు కాసెడి కన్నువాడూ

ఆకాశం ఇడిసిపెట్టి.. ముద్దెట్టే పొలము మట్టి..

ఎండ.. భగ భగ తీర్చే.. చినుకులా దూకుతాడూ

ముప్పు కలగక.. ముందు నిలబడి.. ఆపుతాడూ

ఖడ్గమొకడైతే.. కలహాలు ఒకడివిలే

ఒకడు ఘర్జన.. ఒకడు ఉప్పెన.. వెరసి.. ప్రళయాలే

సైగ ఒకడు.. సైన్యమొకడు.. కలిసి కదిలితె కదనమే

ఒకరికొకరని నమ్మి నడిచిన..

స్నేహమే ఇదిలే.. నూరేళ్ళు నిలవాలే

కంచె ఒకడైతే.. అది మించె వాడొకడే

ఒకడు చిచ్చుర.. ఒకడు తెమ్మెర.. కలిసి దహనాలే

వేగమొకడూ.. త్యాగమొకడూ.. గతము మరువని గమనమే

ఒకరికొకరని నమ్మి నడిచిన..

స్నేహమే ఇదిలే.. నూరేళ్ళు నిలవాలే

రేయ్.. నేనున్నా కదా.. పడుకో

సూరీడే గొడుగు పట్టి.. వచ్చాడే భుజము తట్టి

చిమ్మ చీకటిలోను.. నీడలా ఉండెటోడూ

రెప్పనొదలక.. కాపు కాసెడి కన్నువాడూ

ShareWhatsAppXFacebook

More by Harini Ivaturi

All songs by Harini Ivaturi