Telugu Lyrics

Sarada Saradaga Song Lyrics

సరదా సరదాగా పాట సాహిత్యం - సైంధవ్

ShareWhatsAppXFacebook

Sarada Saradaga Song Lyrics

ఎగిరే స్వప్నాలే మనం.. మనదే కాదా గగనం

సిరివెన్నెలలో తడిసె గువ్వలం.. చిరునవ్వులలో చలనం

ఇది చాల్లే.. ఇంతే చాల్లే

ఇదిలా నిత్యం.. ఉంటే చాల్లే

ఈ నూరెళ్లిలా.. మారే వెయ్యేళ్లుగా

ఊపిరిలో సుమగంధాలే

సరదా సరదా సరదాగా.. సాగిందీ సమయం

మనసూ మనసూ దూరాలె.. మటుమాయం

మనకూ మనకూ పరదాలే.. లేనే.. లేవందాం

ఒకరికి ఒకరై ఒదిగిందీ.. అనుబంధం

కలలా ఉందేంటీ నిజం.. నిజమేనందీ నయనం

మనకే సొంతం అవునా.. ఈ వరం

విరబూసిందీ హృదయం..

అందాల పూల వందనాలు చేసే రాదారులే

తల నిమురుతున్న.. పలకరింపులాయె చిరుగాలులే

ఈ ఉల్లాసమే.. మనకో విలాసమై

మనసంతా.. చిందాడిందె

సరదా సరదా సరదాగా.. సాగిందీ సమయం

మనసూ మనసూ దూరాలె.. మటుమాయం

మనకూ మనకూ పరదాలే.. లేనే.. లేవందాం

ఒకరికి ఒకరై ఒదిగిందీ.. అనుబంధం

ఆనందమే.. అరచేతులా.. వాలిందిలా.. పసిపాపలా

ఒక గుండెలో.. ఈ మురిపెమంతా.. బంధించేదెలే

కరిగి.. ఆ వానవిల్లే.. ఇలా.. రంగుల్లో.. ముంచెత్తగా

ఈ చిత్రం.. ఏ కుంచెలైనా.. చిత్రించేదెలా

సరదా సరదా సరదాగా.. సాగిందీ సమయం

మనసూ మనసూ దూరాలె.. మటుమాయం

మనకూ మనకూ పరదాలే.. లేనే.. లేవందాం

ఒకరికి ఒకరై ఒదిగిందీ.. అనుబంధం

ShareWhatsAppXFacebook

More from Saindhav

All songs from Saindhav

More by Anurag Kulkarni

All songs by Anurag Kulkarni